IPL DC vs PBKS : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ

-

ఎన్నో అనుమానాల మ‌ధ్య ఢిల్లీ క్యాపిట‌ల్స్, పంజాబ్ కింగ్స్ మ్యాచ్ ప్రారంభం అయింది. ఈ మ్యాచ్ లో కీలక‌మైన టాస్ ను ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచింది. దీంతో ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ ముందుగా బౌలింగ్ చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాడు. మ‌యాంక్ అగ‌ర్వాల్ నేతృత్వంలోని పంజాబ్ కింగ్స్ తొలుత బ్యాటింగ్ చేయ‌నుంది. కాగ ముందు ఈ మ్యాచ్ కొన‌సాగుతుందా.. అనే అనుమానాలు ఉండేవి.

ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్టుకు చెందిన టిమ్ సీఫెర్ట్ కు క‌రోనా పాజిటివ్ గా నిర్ధార‌ణ అయింది. దీంతో ఈ మ్యాచ్ పై నీలినీడ‌లు క‌మ్ముకున్నాయి. అయితే మిగితా ఆట‌గాళ్లు అంద‌రికీ నెగిటివ్ రావ‌డంతో.. ఐపీఎల్ నిర్వ‌హ‌కులు ఈ మ్యాచ్ కు అనుమ‌తి ఇచ్చారు.

పంజాబ్ కింగ్స్ తుది జ‌ట్టు :
మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), శిఖర్ ధావన్, జానీ బెయిర్‌స్టో, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (వికెట్ కీప‌ర్), షారుక్ ఖాన్, కగిసో రబడ, నాథన్ ఎల్లిస్, రాహుల్ చాహర్, వైభవ్ అరోరా, అర్ష్‌దీప్ సింగ్

ఢిల్లీ క్యాపిటల్స్ తుది జ‌ట్టు :
పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, రిషబ్ పంత్ (కెప్టెన్ / వికెట్ కీప‌ర్), రోవ్‌మన్ పావెల్, లలిత్ యాదవ్, సర్ఫరాజ్ ఖాన్, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ముస్తాఫిజుర్ రెహమాన్, ఖలీల్ అహ్మద్

Read more RELATED
Recommended to you

Exit mobile version