ఐపిఎల్ 2023: ఉత్కంఠ పోరులో ఢిల్లీ ఘన విజయం … హైదరాబాద్ కు చేదు ఓటమి !

-

ఈ రోజు ఢిల్లీ మరియు హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ చివరి బంతి వరకు పోరాడి అసలైన గేమ్ లో గెలిచి ఎందరో ఢిల్లీ అభిమానుల మనసులను గెలుచుకుంది. క్రికెట్ లో ఎన్నో అద్భుతమైన మ్యాచ్ లను చూసి ఉంటారు. కానీ ఈ రోజు జరిగిన మ్యాచ్ మాత్రం వేరే లెవెల్ అంతే.. అస్సలు ఏమాత్రం గెలుస్తారని ఆశలేని స్థాయి నుండి 7 పరుగుల తేడాతో గెలిచిన ఢిల్లీ పోరాట పటిమకు జై కొట్టాల్సిందే. మొదట టాస్ గెలిచిన వార్నర్ బ్యాటింగ్ ఎంచుకుని సన్ రైజర్స్ ముందు ఏమాత్రం పోటీ ఇవ్వని 145 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. అయితే ఢిల్లీ బౌలర్లు మాత్రం దెబ్బ తిన్న పులుల్లా మొదటి బంతి నుండి గెలుపు కోసం చాలా పోరాడారు.

  • చివరికి వారి పోరాటం ముందు ఓటమి నిలువలేక ఓడిపోయి ఢిల్లీని గెలిపించింది. చివరి ఓవర్ లో 13 పరుగులు అవసరం అయిన దశలో బౌలింగ్ చేసిన అన్ క్యాపెడ్ బౌలర్ ముఖేష్ కుమార్ కేవలం అయిదు పరుగులు మాత్రమే ఇచి ఢిల్లీ కి ఎప్పుడూ గుర్తిండిపోయే విజయాన్ని అందించాడు. ఈ గెలుపుతో ఢిల్లీ ఆడిన 7 మ్యాచ్ లలో రెండు గెలిచి కాస్త ఆత్మవిశ్వాసంతో ఉంది. ఈ గెలుపు ఢిల్లీ ఆటగాళ్ళు, కోచింగ్ స్టాఫ్ మరియు యాజమాన్యానికి చాలా అవసరం. ఈ విజయ పరంపరను ఇలాగే కొనసాగించి ఢిల్లీ ప్లే ఆఫ్ కు చేరాలని కోరుకుందాం.

Read more RELATED
Recommended to you

Latest news