IPL 2022 : సిక్సుల్లో ఐపీఎల్ 2018ని బ్రేక్ చేసిన ఐపీఎల్ 2022

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ .. చరిత్రలో 2022 అంత్యంత వినోదాత్మక సీజన్‌ అని చెప్పాలి. లీగ్‌ దశలో 10 జట్లు ఆడుతుండటంతో క్రికెట్‌ అభిమానులు ఫుల్‌ ఎంజాయ్‌ చేస్తున్నారు. అసాధారణ మైన బ్యాటింగ్‌ ప్రదర్శనలు, గొప్ప బౌలింగ్‌ స్పెల్‌ లు, అద్భుత ఫీల్డింగ్‌ విన్యాసాలతో 15వ సీజన్‌ కొనసాగుతోంది. అయితే..ఈ నేపథ్యంలోనే ఐపీఎల్‌ 2022 ఓ సరికొత్త రికార్డు సృష్టించింది.

క్యాష్‌ రిచ్‌ లీగ్‌ చరిత్రలో ఒక సీజన్‌ లో అత్యధిక సిక్సర్లు నమోదు అయిన రికార్డు ఐపీఎల్‌ 2022 తన పేరుపై లికించుకుందన్నమాట. ఐపీఎల్‌ 2022 లో ఇప్పటి వరకు 873 సిక్సర్లు నమోదు అయ్యాయి. 15వ సీజన్‌ లో ఆదివారం వరకు 61 మ్యాచ్‌ లు జరుగగా.. బ్యాటర్లు 873 సిక్సర్లు బాదారు. ఇంతకు ముందు ఐపీఎల్‌ 2018 సీజన్‌ లో అత్యధికంగా 872 నమోదు అయ్యాయి. ఈ సీజన్‌ లో ఇంకా 11 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే.. 1000 సిక్సర్ల మార్క్‌ ను ఐపీఎల్‌ 2022 అధిగమించే ఛాన్స్‌ ఉన్నట్లు క్రికెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు.