ఐపీఎల్ 2023: ముంబై ముందు భారీ లక్ష్యం … 200 !

-

ముందుగా టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ చాలా తెలివిగా బౌలింగ్ ఎంచుకున్నాడు. కాగా మంచి బ్యాటింగ్ వికెట్ పై బెంగుళూరు టీం కూడా సరిగ్గా బదులిచ్చింది. స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ మొదటి ఓవర్ లోనే అవుట్ అయినా కెప్టెన్ డుప్లిసిస్ మాత్రమే చాలా ఓపికగా పరుగులు చేస్తూ ఇండియాకు వెన్నెముకగా మారాడు. చివరికి నిర్ణీత ఓవర్ లలో డుప్లిసిస్ సేన వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసి, ముంబై ముందు 200 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఈ స్కోర్ సాధించడంలో డుప్లిసిస్ 65 పరుగులు చేసి తన ఫామ్ ను కొనసాగించాడు. ఇతనికి తోడుగా మాక్స్ వెల్ కేవలం 33 బంతుల్లోనే 68 పరుగులు చేసి బెంగుళూరు కు మంచి స్కోర్ ను అందించాడు.

చివర్లో కార్తీక్ 30 పరుగులు చేశాడు. ముంబై బౌలర్లలో బెహ్రాన్ డార్ఫ్ మూడు కీలక వికెట్లు తీసి బెంగుళూరు కు అడ్డుకట్ట వేశాడు. మరి ముంబై ఈ భారీ స్కోర్ ను ఛేదిస్తుందా చూడాలి. మరోసారి కనుక ఇషాన్ కిషన్, సూర్య మరియు డేవిడ్ లు రాణిస్తే గెలుపు లాంఛనమే.

Read more RELATED
Recommended to you

Latest news