సెంచరీతో రెచ్చిపోయిన కేఎల్ రాహుల్…. ముంబై ముందు భారీ లక్ష్యం

-

స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ సెంచరీతో రెచ్చిపోయాడు. ముంబై ఇండియన్స్ తో బ్రేబౌర్న్ స్టేడియం వేదిగా జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జాయింట్స్ భారీ స్కోర్ సాధించింది. కేఎల్ రాహుల్ కెప్టెన్నీ ఇన్నింగ్స్ ఆడాడు. ముంబై బౌలర్లకు చుక్కులు చూపించాడు. కేవలం 60 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సులతో 106 రన్స్ చేశాడు. ఫలితం నాలుగు వికేట్ల నష్టానికి లక్నో సూపర్ జాయింట్ , ముంబై ఇండియన్స్ ముందు 200 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచారు. ఓపెనర్ గా వచ్చిన కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ చివరి వరకు క్రీజులో ఉన్నాడు. కేఎల్ రాహుల్ కు తోడుగా క్వింటన్ డికాక్ 13 బాల్స్ లో 28 పరుగులు , మనీష్ పాండే 29 బాల్స్ లో 38 పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో టైమల్ మిల్స్ , ఫాబియన్ అలెన్ ధారాళంగా పరుగులు ఇచ్చారు. ముంబై బౌలింగ్ లో ఉనత్కద్  2 వికెట్లు తీయగా… మురగన్ అశ్విన్, ఫాబియన్ అలెన్ చెరో వికెట్ తీశారు. ఐపీఎల్ సీజన్ ప్రారంభం అయినప్పటి నుంచి ముంబై వరసగా 5 ఓటములను ఎదుర్కొంది. ప్రస్తుత పరిస్థితుల్లో ముంబైకి విజయం చాలా కీలకం

Read more RELATED
Recommended to you

Latest news