ఐపీఎల్: కోల్ కతా వర్సెస్ పంజాబ్.. రాహుల్ కష్టపడ్డాడు కానీ..

-

ఈ ఐపీఎల్ సీజన్లో వరుసగా ఐదు మ్యాచులు ఓడిన పంజాబ్ టీమ్, కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచులో గెలుస్తుందేమో అనుకున్నారు. కానీ మ్యాక్స్ వెల్ బ్యాటింగ్ లో విఫలమవడంతో పంజాబ్ కి ఓటమి తప్పలేదు. 165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్, కెప్టెన్ కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ విజృంభించడంతో కోల్ కతా స్కోరు దగ్గరి దాకా వచ్చారు. చివర్లో మూడు బంతుల్లో ఏడు పరుగులు చేయాల్సి ఉండగా రెండు బంతులు ఊరికే వదిలేయడం కొంత ఆశ్చర్యంగా ఉంది. ఆ తర్వాత ఆఖరి బంతికి ఫోర్ బాది నాలుగు పరుగులు రాబట్టుకుని రెండు పరుగుల తేడాతో ఓడిపోయారు.

పంజాబ్ టీమ్ లో కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా, మయాంక్ అగర్వాల్ అతనికి మంచి భాగస్వామ్యం అందించాడు. 58బంతులాడిన కేఎల్ రాహుల్ 6ఫోర్లు బాది 78పరుగులు చేసాడు. అటు మయాంక్ అగర్వాల్, 6ఫోర్లు, ఒక సిక్సర్ తో 56పరుగులు(39బంతుల్లో) చేసాడు. మిగతా వారిలో ఎవ్వరూ అంత చెప్పుకోదగినట్టుగా ఆడలేదు. నికోలస్ పూరన్ 16పరుగులు, మ్యాక్స్ వెల్ 10పరుగులు చేసారు. కోల్ కతా బౌలర్లలో ప్రసీద్ క్రిష్ణ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు. నాలుగు ఓవర్లు వేసిన ప్రసీద్ 3వికెట్లు తీసి 29పరుగులు ఇచ్చాడు. మిగతా వారిలో సునీల్ నరైన్ ఒక్కడే రెండు వికెట్లు తీసుకున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news