ఐపీఎల్: RR vs KKR రాజస్తాన్ లక్ష్యం 175..

-

డ్రీమ్ 11 ఐపీఎల్ లో నేడు రాజస్తాన్ రాయల్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మద్య మ్యాచ్ జరగుతుంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20ఓవర్లలో 174పరుగులు ఇచ్చింది. కోల్ కతా నైట్ రైడర్స్ టీమ్ లో శుభ్ మంగిల్ 47పరుగులు ( 34బంతుల్లో 5ఫోర్లు, 1 సిక్సర్) చేసాడు. సునీల్ నరైన్ 15 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఆ తర్వాత నితేష్ రానా 17 బంతుల్లో 22పరుగులు, ఆండ్రూ రస్సెల్ 14బంతుల్లో 24 పరుగులు చేసారు.

ఐతే ఆ తర్వాత ఇయాన్ మోర్గాన్ విజృంభించి జట్టుకి డీసెంట్ స్కోరుని అందించాడు. ఇయాన్ మోర్గాన్ 23బంతుల్లో 1ఫోరు, 2సిక్సర్లు బాది 34పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. మొత్తం 20ఓవర్లలో 6వికెట్లు కోల్పోయి 174పరుగులు చేసింది. రాజస్తాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. 4ఓవర్లు వేసిన జోఫ్రా ఆర్చర్, రెండు వికెట్లు తీసి 18పరుగులు ఇచ్చాడు. మిగతా వారిలో అంకిత్ రాజ్ పుత్, జైదేవ్ ఉనద్కత్, టామ్ కరేన్, రాహుల్ తెవాటియా తలా ఒక వికెట్ తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news