IPL-2022: లక్నో, రాజస్థాన్ మధ్య బిగ్ ఫైట్… బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్

-

సూపర్ సండేలో భాగంగా ఈ రోజు రెండో మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య కీలక పోరు జరుగబోతోంది. ముంబైలోని బ్రెబౌర్న్ స్టేడియం వేదికగా ఈ రెండు జట్లు తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి రాజస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. టాప్ 4లో ఉన్న ఈ రెండు జట్ల మధ్య ఆసక్తి పోరు కొనసాగనుంది. లక్నో జట్టులో కెప్టెన్ కేఎల్ రాహుల్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. మరోవైపు రాజస్థాన్ తరుపున బట్లర్ ఉండనే ఉన్నారు. పవర్ హిట్టర్లకు రెండు జట్లలో కొదవే లేదు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 12 మ్యాచుల్లో 8 విజయాలతో రెండో స్థానంలో ఉంటే… రాజస్థాన్ 12 మ్యాచుల్లో 7 విజయాలతో మూడో స్థానంలో ఉంది. భారీ స్కోరింగ్ మ్యాచ్ నమోదు అయ్యే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. 

తుది జట్ల వివరాలు:

లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్(w), KL రాహుల్(c), దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, ఆయుష్ బడోని, మార్కస్ స్టోయినిస్, జాసన్ హోల్డర్, మొహ్సిన్ ఖాన్, రవి బిష్ణోయ్, దుష్మంత చమీరా, అవేష్ ఖాన్
రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్(w/c), దేవదత్ పడిక్కల్, జేమ్స్ నీషమ్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్, ఒబెడ్ మెక్‌కాయ్

Read more RELATED
Recommended to you

Latest news