ఎస్ఆర్ఎచ్ స‌పోర్టు ను మ‌ర్చి పోలేను – ర‌షీద్ ఖాన్

ఎస్ఆర్ఎచ్ తో త‌న ప్ర‌యాణం మ‌ర్చిపోలేన‌ది అని ఆఫ్ఘ‌నిస్థాన్ స్పిన్న‌ర్ ర‌షీద్ ఖాన్ అన్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు త‌న‌కు స‌హక‌రించిన స‌న్ రైజ‌ర్స్ జ‌ట్టు కు ధ‌న్య‌వాదాలు తెలిపాడు. అలాగే ఆరెంజ్ ఆర్మీ తో త‌న ప్ర‌యాణం ఇప్ప‌టి వ‌ర‌కు అద్భ‌తం గా సాగింద‌ని అన్నాడు. హైద‌రాబాద్ అభిమానుల స‌పోర్టు కూడా మ‌ర్చి పోలేన‌ని ర‌షీద్ ఖాన్ అన్నారు. త‌న‌కు ఇప్ప‌టి కి కూడా స‌న్ రైజ‌ర్స్ అభిమానులే బ‌లం అని అన్నారు.

అలాగే హైద‌రాబాద్ అభిమానుల ప్రేమ ను త‌ను ఎప్ప‌టి కీ మ‌ర్చి పోలేన‌ని అన్నారు. ఈ అలాగే త‌న‌కు అరెంజ్ అర్మీ తో ఉన్న అనుబంధాన్ని ట్విట్ట‌ర్ ద్వారా తెలిపాడు. అయితే ఇటీవ‌ల జ‌రిగిన ఐపీఎల్ రిటెన్ష‌న్ ప్ర‌క్రియా లో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు ర‌షీద్ ఖాన్ ను రిటైన్ చేసుకోలేదు. దీంతో స్టార్ స్పిన్న‌ర్ ర‌షీద్ ఖాన్ స‌న్ రైజ‌ర్స్ జట్టు కు దూరం కానున్నాడు. ర‌షీద్ ఖాన్ ను మెగా వేలంలో అధిక ధ‌ర కు ఇత‌ర ఫ్రొచైంజీలు కొనుగోలు చేసే అవ‌కాశం ఉంది.