మెడ మీత క‌త్తి పెడితే రాష్ట్రాన్ని అమ్మెస్తావా? : మాజీ మంత్రి శ్రీ‌ధ‌ర్

-

కేంద్ర ప్ర‌భుత్వం మెడ‌ మీద క‌త్తి పెట్టి బాయిల్డ్ రైస్ విష‌యం పై సంత‌కం తీసుకున్నార‌ని సీఎం కేసీఆర్ అన‌డం క‌రెక్ట కాద‌ని మాజీ మంత్రి దుద్దిల్ల శ్రీ‌ధ‌ర్ బాబు అన్నారు. ఇప్పుడు కేసీఆర్ మెడ మీద క‌త్తి పెడితే రాష్ట్రాన్ని మోడీకి రాసి ఇస్తావా అని ప్ర‌శ్నించారు. లేదా అంబానీ కి ఆదానీ కి అమ్మెస్తావా అని విమ‌ర్శించాడు. రాష్ట్రం లో వ‌రి ధాన్యం కొనుగోలు చేయాల్సిన బాధ్య‌త రాష్ట్ర ప్ర‌భుత్వం దే అని అన్నారు.

అలాగే రైతు పండించిన పంట కు మ‌ద్ద‌త్తు ధ‌ర క‌ల్పించాల్సిన బాధ్య‌త కేంద్ర ప్ర‌భుత్వాని దే అని అన్నారు. కానీ కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు రైతు ల‌ను ఆయోమాయం లోకి నెట్టాయ‌ని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు రైతుల పై చేస్తున్న మోసాన్ని గ‌వ‌ర్న‌ర్ కు వివ‌రించామ‌ని తెలిపారు. కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి, రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్.. వ‌రి ధాన్యం కొనుగోలు విష‌యం లో కేంద్రాన్ని ఒప్పించాల‌ని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news