RCB టీమ్​తో హైద‌రాబాద్‌లో సిరాజ్ కొత్త ఇంటికెళ్లిన కోహ్లీ

-

మహమ్మద్ సిరాజ్.. ఈ హైదరాబాద్ కుర్రాడు ప్రస్తుతం ఐపీఎల్​లో రాయల్ ఛాలెంజర్స్ బెంళూరు జట్టుకు ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్​లో సిరాజ్ తన దూకుడును ప్రదర్శిస్తున్నాడు. ఈసారి ఐపీఎల్‌లో ఆర్సీబీ త‌ర‌పున అత్య‌ధిక వికెట్లు తీసుకున్న సిరాజ్‌.. ప్ర‌స్తుతం ఆ టోర్నీలో మంచి ఫామ్​లో ఉన్నాడు. గురువారం రోజు ఉప్ప‌ల్ స్టేడియం వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్ జ‌ట్టుతో ఆర్సీబీ త‌ల‌ప‌డ‌నుంది. అయితే హైద‌రాబాద్ చేరుకున్న ఆర్సీబీ జ‌ట్టు స‌భ్యులు .. సోమ‌వారం రాత్రి సిరాజ్ కొత్త ఇంట్లో విందుకు వెళ్లారు.

కోహ్లీతో పాటు ఆర్సీబీలోని కొంద‌రు ప్లేయ‌ర్లు .. హైద‌రాబాద్‌లోని ఫిల్మ్ న‌గర్‌లో ఉన్న సిరాజ్ కొత్త ఇంటికెళ్లారు. కోహ్లీతో పాటు డూప్లెసిస్‌, వెయిన్ పార్నెల్‌, కేదార్ జాద‌వ్‌లు ఆ జాబితాలో ఉన్నారు. ఇటీవ‌ల సిరాజ్ కొత్త ఇంటికి చెందిన ఓ వీడియో ఆన్‌లైన్‌లో వైర‌ల్ అయ్యింది. సిరాజ్​కు విరాట్ అంటే ఎంతో అభిమానం అన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా సార్లు సిరాజ్ కోహ్లీపై తన అభిమానాన్ని చాటుకున్నాడు.

 

Read more RELATED
Recommended to you

Latest news