ఇండియన్ క్రికెట్ టీమ్ వైట్ బాల్ ఫార్మాట్ లో విపరీతమైన పోటీ ఉందన్న సంగతి తెలిసిందే. ఐపిఎల్ పుణ్యమా అని చాలా మంది ఆటగాళ్లు ఇండియా సెలక్టర్ల తలుపు తడుతున్నారు. అందుకే జట్టులో చోటు దక్కించుకుంటున్న కుర్రాళ్ళు ఎందరో దక్కిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక మళ్లీ జట్టులో చోటును కోల్పోతున్నారు. కానీ ఒకరిద్దరు ఆటగాళ్ళు అయితే ప్రతిభ ఉన్నా జట్టులో రెగ్యులర్ ఆటగాళ్ళుగా కొనసాగలేకపోతున్నారు. అటువంటి ఆటగాళ్లలో ఒకరే సంజు శాంసన్. కేరళకు చెందిన ఈ యువ ఆటగాడు ఎన్నో సార్లు జట్టులోకి వస్తున్నా ఒకటి రెండు మ్యాచ్ లకే పరిమితం కావడం.. ఆడకపోతే మళ్లీ విద్వాసనకు గురవ్వడం చేస్తున్నారు.
అంతే కానీ అందరిలాగే కొన్ని ఎక్కువ మ్యాచ్ లు అవకాశం ఇవ్వడంలో బీసీసీఐ సెలెక్టర్లు విఫలం అవుతున్నారని ఎందరో విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఒక ప్లేయర్ గా మరియు కెప్టెన్ గా సంజు శాంసన్ కు ఐపిఎల్ అద్భుతమైన అవకాశం ఇందులో కనుక అసాధారణంగా ప్రదర్శన చేస్తే వరల్డ్ కప్ కు ఎన్నిక అయినా ఆశ్చర్యపడనవసరం లేదు. మరి చూద్దాం శాంసన్ బీసీసీఐ ని మెప్పిస్తాడా ??