వచ్చే సీజన్ లో కలుద్దాం: విరాట్ కోహ్లీ

-

అదిగో టైటిల్.. ఈసారి ఆర్సీబీదే టైటిల్.. ఈ సీజన్ లో టైటిల్ కోహ్లీసేనకే.. అంటూ ఐపీఎల్ టైటిల్ కోసం పదిహేనేళ్లుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎదురుచూస్తోంది. బెంగళూరు జట్టుకు అందని ద్రాక్షగా మారింది ఐపీఎల్ కప్. ఈసారి కూడా ఐపీఎల్ టైటిల్ సాధించకుండా ఆర్సిబి వెనుతిరగడంపై విరాట్ కోహ్లీ స్పందించాడు.” కొన్నిసార్లు గెలుస్తాం.. కొన్నిసార్లు ఓడిపోతాం.. కానీ అభిమానులు మాత్రం సపోర్ట్ చేస్తూనే ఉంటారు. మీ అభిమానంతో క్రికెట్ ను ప్రత్యేకంగా మార్చారు.

 

నేర్చుకోవడం ఎన్నటికీ ఆగదు. మేనేజ్మెంట్ కు, సపోర్టు స్టాఫ్ కు, ఈ అద్భుతమైన ఫ్రాంఛైజీలో భాగమైన ప్రతి ఒక్కరికీ థాంక్స్. వచ్చే సీజన్లో కలుద్దాం.” అంటూ ట్వీట్ చేశారు విరాట్ కోహ్లీ. కాగా ఆర్సిబి అదృష్టం బాగానే కలిసి వస్తుంది.. ఆర్సిబి ప్లే ఆఫ్ కు చేరుకోవడం వరుసగా ఇది మూడో ఏడాది. కేవలం రెండు అడుగుల దూరంలో టైటిల్ కోల్పోయింది ఆర్సిబి. బహుశా ఈ పెయిన్ ఎంత బాధిస్తుందో.. ఒక విరాట్ కోహ్లీకి తప్ప ఎవరికీ తెలియకపోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news