కోహ్లీ రికార్డ్ బద్దలు కట్టిన కేఎల్ రాహుల్

-

కోహ్లీ రికార్డును బద్దలు కొట్టాడు స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్. టీ20ల్లో వేగవంతంగా 6 వేల పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కేఎల్ రాహుల్ కూడా చేరాడు. ఈ విషయంలో కింగ్ కోహ్లీ రికార్డును అధిగమించాడు. కేఎల్ రాహుల్ 179 ఇన్నింగ్స్ లో ఈ ఘటత సాధించాడు. గతంలో కోహ్లీ 184 మ్యాచుల్లో 6 వేల పరుగులను సాధించారు. ఓవరాల్ గా చూస్తే టీ20ల్లో అత్యంత వేగంగా 6 వేల పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో వెస్టిండీస్ స్టార్ క్రిస్ గేల్ మొదటి స్థానంలో ఉన్నాడు. 162 ఇన్నింగ్స్ లో గేల్ ఈ ఫీట్ సాధించాడు. పాక్ కెప్టెన్ బాబార్ ఆజామ్ 165 ఇన్నింగ్స్ లో 6 వేల పరుగులు పూర్తి చేసి రెండో స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం  ఈ జాబితాలో కేఎల్ రాహుల్ మూడో స్థానంలో నిలిచాడు. మరోవైపు ఐపీఎల్లో కూడా కేఎల్ రాహుల్ అదరగొడుతున్నాడు. లక్నో సూపర్ జాయింట్ కెప్టెన్ గా వ్యహరిస్తున్న కేఎల్ రాహుల్ కీలక ఇన్సింగ్స్ లు ఆడుతున్నాడు. ఇప్పటి వరకు ఐపీఎల్ ఈ సీజన్ లో 7 ఇన్నింగ్స్ లో 265 రన్స్ చేసి టాప్ 2 స్కోరర్ గా నిలిచాడు.

Read more RELATED
Recommended to you

Latest news