ఆస్ట్రేలియా క్రికెట్ జ‌ట్టు కు కొత్త కెప్టెన్

ఆస్ట్రేలియా టెస్టు క్రికెట్ జ‌ట్టు కు కొత్త కెప్టెన్ గా స్టార్ బౌల‌ర్ ప్యాట్ క‌మ్మిన్స్ ను ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఎంచుకుంది. అలాగే వైస్ కెప్టెన్ గా స్టీవ్ స్మిత్ ను ఎంచు కుంది. అయితే ఇప్ప‌ట వ‌ర‌కు ఆస్ట్రేలియా టెస్టు జ‌ట్టు కు కెప్టెన్ గా టీమ్ ఫైన్ ఉన్నాడు. అయితే టీమ్ ఫైన్ టెస్టు జ‌ట్టు నుంచి త‌ప్ప‌కున్నాడు.

గ‌తంలో టీమ్ ఫైన్ ఒక మ‌హిళ తో అస‌భ్య క‌రం గా చాట్ చేయ‌డం తో అది ఇప్పుడు బ‌య‌ట కు వ‌చ్చి వివాద‌స్పదం అయింది. దీంతో తను కెప్టెన్ బాధ్య‌త ల నుంచి టీమ్ ఫైన్ త‌ప్పుకున్నాడు. అయితే టీమ్ ఫైన్ త‌ర్వాత టెస్టు క్రికెట్ జ‌ట్టు కు స్టీవ్ స్మిత్ ను కెప్టెన్ గా నియ‌మించే అవ‌కాశం ఉంద‌ని భావించారు. అయితే స్టీవ్ స్మిత్ గ‌తంలో బాల్ టాంప‌రింగ్ వివాదం లో చిక్కు కుని రెండు సంవ‌త్స‌రాలు నిషేధానికి గురి అయ్యాడు. దీంతో స్టీవ్ స్మిత్ వైపు క్రికెట్ ఆస్ట్రేలియా మొగ్గు చూప‌లేద‌ని తెలుస్తుంది. కానీ స్టీవ్ స్మిత్ అనుభావం ఉప‌యోగ‌పడాల‌ని వైస్ కెప్టెన్ గా క్రికెట్ ఆస్ట్రేలియా నియ‌మించింది.