మళ్లీ జట్టులోకి వస్తానన్న ఆశలు లేవు: వృద్ధిమాన్ సాహా

తాను మళ్లీ టీమిండియా జట్టు లోకి వచ్చే అవకాశాలు లేనట్టేనని క్రికెటర్ వృద్ధిమాన్ సాహా ఆవేదన వ్యక్తం చేశాడు. డిసెంబర్ 2021 లో తన చివరి టెస్టు మ్యాచ్ ఆడిన సాహా.. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ లో అంచనాలకు మించి రాణించారు. ఈ ఏడాది ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడిన సాహా.. ఓపెనర్ గా బరిలోకి దిగి 11 మ్యాచ్ లలో 31.70 సగటుతో మరియు 112.39 స్ట్రైక్ రేటు తో 317 పరుగులు చేశాడు.

దీనితో ఇంగ్లాండ్ టూర్ తో పాటు ఐర్లాండ్ తో రెండు to -20 ల కు ఎంపిక చేసే జట్టులో తిరిగి చోటు లభిస్తుందని అనుకున్నాడు. కానీ సెలెక్టర్లు తనని పక్కకు పెట్టడంతో సాహా ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే జట్టులో చోటు దక్కకపోయినా తాను మాత్రం క్రికెట్ ఆడడం మాననని, ఆటను ప్రేమించినంత వరకు క్రికెట్ ఆడుతూనే ఉంటానని సాహా చెప్పుకొచ్చాడు.