కోహ్లీ లేకపోతే ఈ ప్రశ్నలకి సమాధానం ఏమిటి.. పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు.

ఆస్ట్రేలియాతో జరగనున్న టెస్టు మ్యాచులకి కోహ్లీ హాజరు కాలేకపోతుండడంతో అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మొత్తం నాలుగు టెస్టుల్లో కోహ్లీ, కేవలం ఒకే ఒక్క టెస్టు ఆడనుండడంతో మిగతా మ్యాచుల పరిస్థితి ఏంటన్నది చర్చనీయాంశంగా మారింది. ఈ విషయమై క్రికెట్ విశ్లేషకులు అనేక అభిప్రాయాలు వెలిబుచ్చుతున్నారు. మాజీ క్రికెటర్ పాంటింగ్ సైతం అనేక సందేహాలని బయటపెట్టాడు.

కోహ్లీ ఆడకపోతే ఓపెనర్ గా ఎవరు వస్తారు. నాలుగవ స్థానంలో బ్యాటింగ్ కి ఎవరు దిగుతారు. స్మిత్, వార్నర్ వంటి దిగ్గజ ఆటగాళ్లతో పటిష్టంగా ఉన్న ఆస్ట్రేలియాతో జరగనున్న టెస్ట్ మ్యాచుకి కోహ్లీ ఆడకపోతే అది వన్ సైడ్ అయ్యే అవకాశం ఉండదా? ఈ ప్రశ్నలకి సమాధానాలు ఎవరు చెప్తారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. భారత జట్టు ఆస్ట్రేలియాతో మొత్తం మూడు వన్డేలు, మూడు టీ ట్వంటీలు, నాలుగు టెస్టులు ఆడనుంది.