టీమిండియా, సౌతాఫ్రికా మధ్య టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ రోజు రెండు కాగ.. వర్షం కారణంగా రెండు రోజు పూర్తిగా రద్దు అయింది. రెండో రోజు కనీసం ఒక్క బంతిని కూడా వర్షం పడనివ్వలేదు. వర్షం తగ్గుముఖం పట్టక పోవడంతో పాటు.. మైదానంలో వర్షపు నీరు నిలవడం తో రెండు రోజును పూర్తి రద్దు చేస్తున్నామని అంపర్లు ప్రకటించారు. కాగ తర్వాతి రెండు రోజుల పాటు వర్ష సూచన లేదని తెలిపారు. అలాగే రెండో రోజు రద్దు కావడంతో మిగిలిన రోజులలో 98 ఓవర్ల చొప్పున షెడ్యూల్ చేశారని తెలిపారు.
అయితే సాధారణంగా టెస్ట్ మ్యాచ్ లో ఒక్క రోజుకు 90 ఓవర్లు మాత్రమే ఉంటాయి. కాగ మొదటి రోజులో సౌత్ ఆఫ్రికా పై టీమిండియా పూర్తి ఆధిపత్యం చేలాయించింది. ఓపెనర్ కెఎల్ రాహుల్ 122 పరుగులు, అజింక్య రహానే 40 పరుగులతో క్రిజ్ లో ఉన్నారు. కాగ మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 60 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. కాగ రెండో రోజు రద్దు కావడంతో మూడో రోజు టీమిండియా బ్యాట్స్ మెన్లు భారీ స్కోర్ చేసి సౌత్ ఆఫ్రికా ముందు భారీ టార్గెట్ ను ఉంచాలి. అప్పుడే టీమిండియా కు విజయ అవకాశాలు ఉంటాయి.