వాళ్ల వల్లే నా బ్యాటింగ్ స్ట్రాటజీ మారింది : విరాట్ కోహ్లీ

-

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఆసీస్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అదరగొట్టాడు. 48 బంతుల్లో 63 పరుగులతో సిరీస్‌ కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. స్వల్ప వ్యవధిలో వికెట్లను కోల్పోయిన సమయంలోనూ దూకుడు కోహ్లీ ప్రదర్శించాడు. మ్యాచ్‌ అనంతరం తన బ్యాటింగ్‌ స్ట్రాటజీ ఏంటనేది విరాట్ కోహ్లీ వెల్లడించాడు. కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ పలు సూచనలు చేశారని పేర్కొన్నాడు.

‘‘ఒక ఎండ్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ భారీగా హిట్టింగ్‌ చేస్తున్న క్రమంలో నేనొకసారి డగౌట్‌ వైపు చూశా. కెప్టెన్ రోహిత్, కోచ్‌ ద్రవిడ్‌.. ‘నువ్వు అలాగే నిలకడగా బ్యాటింగ్‌ చేస్తూ ఉండు’.. అనే అర్థం వచ్చేలా చెప్పారు.  ఎందుకంటే సూర్యకుమార్‌ చాలా బాగా ఆడుతున్నాడు. అందుకే మంచి భాగస్వామ్యం నిర్మించాలని సూచించారు. దీంతో నా అనుభవం కాస్త ఉపయోగించి నిదానంగా ఆడా. ఎప్పుడైతే సూర్య ఔటై పెవిలియన్‌ చేరాడో..  హిట్టింగ్‌ చేసేందుకు ప్రయత్నించా. ప్యాట్‌ కమిన్స్‌ బౌలింగ్‌లో సిక్స్‌ బాదడంతో మళ్లీ నేను దూకుడుగా ఆడేందుకు సిద్ధమయ్యా. అందుకే.. నేను బ్యాటింగ్ ఆర్డర్‌లో మూడో స్థానంలో వచ్చేది. నా అనుభవం వినియోగించి జట్టు అవసరాలకనుగుణంగా ఆడాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్‌లో నాకు మంచి ఆరంభమే వచ్చింది. అయితే ఆడమ్‌ జంపా బౌలింగ్‌లో కాస్త ఆచితూచి ఆడా. ఎందుకంటే మిడిల్‌ ఓవర్లలో ఆసీస్‌కు చాలా కీలక బౌలర్. ఓ వైపు సూర్యకుమార్‌ హిట్టింగ్‌ చేస్తుండటంతో అతడికి సహాయక పాత్ర పోషించా’’ అని విరాట్ వివరించాడు.

Read more RELATED
Recommended to you

Latest news