సీఎండీ ప్రభాకర్ రావుపై కోడి గుడ్డు మీద ఈకలు పీకే ఒకరిద్దరు సబ్ స్టాండర్డ్ గాళ్ళు అవాకులు చవాకులు పేలుతున్నారని మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణా స్టేట్ పవర్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం టీఎస్ జెన్కో ఆడిటోరియంలో జరిగిన విద్యుత్ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి జగదీష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ద కాలంలో సాధించిన విజయాలను ప్రజల్లోకి రివిగా తీసుకెళ్లాలని విద్యుత్ ఉద్యోగులకు మంత్రి సూచించారు. అభివృద్ధిలో భాగస్వామ్యమైన ఉద్యోగుల శ్రమ ప్రజలకు బోధపడుతుందన్నారు. విద్యుత్ రంగంలో సమిష్టి కృషితోనే విజయాలు సాధించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్కో&జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు, టీఎస్ఎస్‌పీడీసీఎల్సీ ఎండీ రఘుమా రెడ్డి, ఎన్‌పీడీసీఎల్‌సీ ఎండీ గోపాల్ రావు, జేఏసీ చైర్మన్ సాయిబాబా అధ్యక్షతన జరిగిన ఈ సమ్మేళనంలో పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు.
ఇదిలా ఉంటే.. సూర్యాపేట నూతన సమీకృత కలెక్టరేట్ పనులలో ఎక్కడా కూడా రాజీ పడకుండా పనుల్లో మరింత వేగం పెంచాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సంబంధిత అధికారులు, గుత్తేదారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావ్‌తో కలిసి పట్టణంలోని కుడకుడలో నూతన సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను ఆయన పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.