భారత్‌తో తాజాగా జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ భారత్ చేతిలో ఘోర పరాభవం చవి చూసింది. పిచ్ పూర్తిగా స్పిన్నర్లకు అనుకూలించడం, భారత్‌కు హోం గ్రౌండ్ అడ్వాంటేజ్ లభించడంతో మ్యాచ్ ఏకపక్షమే అయింది. అప్పటికీ ఇంగ్లండ్ బౌలర్లు కూడా స్పిన్ పిచ్‌పై రాణించారు. కానీ భారత స్పిన్నర్లదే పైచేయి అయింది.
అయితే ఈ పరాజయాన్ని దృష్టిలో పెట్టుకుని అన్నాడో, లేదా మరేదైనా కారణమో తెలియదు కానీ.. ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ మాత్రం తాజాగా ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నట్లు తెలిసింది. అందులో భాగంగానే రూట్ తాజాగా చేసిన కామెంట్లు ఆసక్తికరంగా మారాయి. వచ్చే వర్షాకాలంలో ఇంగ్లండ్‌లో భారత్ పర్యటించనుంది. అక్కడ టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో భారత్ కోసం మంచి పిచ్‌లను సిద్ధం చేస్తామని జో రూట్ ప్రకటించాడు.
భారత్‌లో మాదిరిగా కాకుండా ఇంగ్లండ్‌లో మంచి బ్యాటింగ్‌తోపాటు సీమర్లకు అనుకూలించే విధంగా పిచ్‌లను రూపొందిస్తామని జో రూట్ తెలిపాడు. సహజంగానే ఇంగ్లిష్ దేశాల్లో పిచ్‌లు సీమర్లకు అనుకూలిస్తాయి. ఫాస్ట్ బౌలర్లు రాజ్యమేలుతారు. అయితే ప్రస్తుత ఓటమిని భరించలేని జో రూట్ ఇండియన్ ప్లేయర్ల కోసం మంచి సీమింగ్ పిచ్‌లను రూపొందిస్తామని చెప్పకనే చెప్పినట్లు అతని మాటలను బట్టి చూస్తే అర్థమవుతుంది. భారత బ్యాట్స్‌మెన్ సీమర్లను విదేశీ గడ్డపై ఎదుర్కోవడంలో కొంత తడబడడం సహజమే. అయితే ప్రస్తుతం ఉన్న భారత జట్టు ఒకప్పటి జట్టు కాదు. ఇటీవలే ఆస్ట్రేలియాలో సిరీస్‌ను గెలిచింది. అంతకు ముందు కూడా విదేశీ గడ్డపై పలు సిరీస్‌లను గెలుచుకుంది. ఈ క్రమంలో త్వరలో ఇంగ్లండ్‌లో కూడా భారత్ రాణించేందుకు సిద్ధమవుతుంది. అయితే మరి జో రూట్ చేసిన కామెంట్ల నేపథ్యంలో అక్కడ పిచ్‌లు ఎలా ఉంటాయో, భారత ప్లేయర్లు ఆ పిచ్‌లపై ఎలా ఆడుతారో తెలియాలంటే ఆగస్టు వరకు వేచి చూడక తప్పదు.