కోహ్లీ లేకుంటే టెస్ట్ సిరీస్ వాళ్లదే.. ఇంగ్లండ్ కెప్టెన్ మైకేల్ వాన్.

-

ఐపీఎల్ టోర్నమెంట్ పూర్తయ్యాక భారత క్రికెట్ టీమ్ ఆస్ట్రేలియా టూర్ కి వెళ్ళింది. 30మంది జట్టు సభ్యులతో ఇండియా టీమ్ ఆస్ట్రేలియా చేరుకుంది. ఈ సిరీస్ లో మూడు టీ ట్వంటీలు, మూడువన్డేలు, నాలుగు టెస్టులు ఆడాల్సి ఉంది. ఐతే ఈ సిరీస్ లో ఒక్క టెస్టుకి మాత్రమే కోహ్లీ హాజరు అవుతున్నాడు. తండ్రి కాబోతున్న సందర్భంగా మిగతా మూడు టెస్టులు ఆడలేకపోతున్నాడు. ఈ విషయమై ఇంగ్లండ్ కెప్టెన్ మైకేల్ వాన్ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు.

మిగతా మూడు టెస్టులకి కోహ్లీ హాజరు లేకపోతే గనక టెస్ట్ సిరీస్ ఆస్ట్రేలియా వశం అవుతుందని జోస్యం చెప్పాడు. అన్ని ఫార్మాట్లలో అద్భుత ప్రదర్శన ఇవ్వగలిగే కోహ్లీ టెస్టులకి దూరమవడం వల్ల ఆస్ట్రేలియాకి ప్లస్ అవుతుందని, దానివల్ల వారికి గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని తెలిపాడు. మరి మైకేల్ వాన్ చెప్పిన జోస్యం ఫలిస్తుందా లేదా చూడాలి. అటు పక్క వన్డే, టీ ట్వంటీలకి రోహిత్ విశ్రాంతి తీసుకుంటున్నాడని తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news