ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ నిన్న తన వ్యక్తిగత జీవితంలో ఒక ఉన్నతమైన పదవిని పొందాడని చెప్పాలి. మిచెల్ మార్ష్ గ్రెటా మాక్ అనే అమ్మాయిని నిన్న వివాహం చేసుకున్నాడు. దీనితో ఒక అమ్మాయికి భర్తగా మారే అదృష్టాన్ని పొందగలిగాడు. ఈ విషయాన్నీ మిచెల్ మార్ష్ తానే స్వయంగా సోషల్ మీడియా వేదికగా అందరితో పంచుకున్నాడు. దీనితో తన కుటుంబ సభ్యులు, స్నేహితులు , తోటి ఆటగాళ్లు, అభిమానులు అందరూ ఈయనకు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు.
కాగా ప్రస్తుతం మిచెల్ మార్ష్ ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మొదటి రెండు మ్యాచ్ లలో ఆడిన అంతగా ప్రభావం చూపించలేకపోయాడు. మూడవ మ్యాచ్ కు మాత్రం వివాహాం కారణంగా మధ్యలోనే వచ్చేయడంతో.. ఆడలేకేపోయాడు. మళ్ళీ ఎప్పుడు ఐపీఎల్ లో జాయిన్ అవుతాడు అన్నది తెలియాల్సి ఉంది.