IPL 2022 : టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న లక్నో.. జట్ల వివరాలు ఇవే

-

ఐపీఎల్‌ 2022 లో భాగంగా ఇవాళ రెండు బిగ్‌ ఫైట్స్‌ జరుగనున్నాయి. ఇందులో భాగంగా మొదటి మ్యాచ్‌ ఢిల్లీ క్యాపిటల్స్ vs లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య 45వ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌ ముంబైలోని వాంఖడే స్టేడియంలో మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం కానుంది. అయితే.. ఈ మ్యాచ్ కు సంబంధించిన టాస్‌ ప్రక్రియ కాసేపటి క్రితమే ముగిసింది. ఇందులో టాస్‌ గెలిచిన లక్నో..బ్యాటింగ్‌ ఎంచుకుంది. దీంతో మొదట ఢిల్లీ జట్టు బౌలింగ్‌ చేయనుంది.

జట్ల వివరాలు :

ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్(w/c), లలిత్ యాదవ్, రోవ్‌మన్ పావెల్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ముస్తాఫిజుర్ రెహమాన్, చేతన్ సకారియా

లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్(w), KL రాహుల్(c), దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, కృష్ణప్ప గౌతమ్, జాసన్ హోల్డర్, దుష్మంత చమీర, మొహసిన్ ఖాన్, రవి బిష్ణోయ్

Read more RELATED
Recommended to you

Latest news