నేను కార్మికుడునే..మాకు పండుగలు, పబ్బాలు, ఆదివారాలు ఉండవు – చిరంజీవి

-

నేను కార్మికుడునే..మాకు పండుగలు, పబ్బాలు, ఆదివారాలు ఉండవని చిరంజీవి అన్నారు. ఇవాళ రవీంద్ర భారతీలో మేడే వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ… సినీ కార్మికులందరు చేసుకుంటున్న పండుగకు నన్ను ఆహ్వానించిన ఫెడరేషన్ కు ధన్యవాదాలు అన్నారు.

నాకు తెలుసు ఇలాంటి కార్యక్రమం ఎప్పుడు జరగలేదని…ఈ కార్యక్రమం ఇంత బాగా జరగటానికి కారమైన ప్రతి ఒక్కరికి నా అభినందనలు అని పేర్కొన్నారు. ఇలాంటి సినీ కార్మికోత్సవాలు నిరంతరం జరగాలని… కార్మికులు ఉద్యమించి తెచ్చుకున్న పండుగ ఇదన్నారు.

సినీ పరిశ్రమలోఎవరి దారి వారిదే అవడం వల్ల ఇంతకు ముందు ఇలాంటి మేడేను జరుపుకోలేదని… ఈ రోజు కోసం నేను అమెరికా పర్యటన వాయిదా వేసుకున్నానని పేర్కొన్నారు. బయటి కార్మికులకు, సినీ కార్మికులకు చాలా తేడా ఉంటుందని… బయటి కార్మికులకు నిర్ణీతమైన సమయం, వాతావరణం ఉంటుందని స్పష్టం చేశారు. సినీ కార్మికులకు నిర్ణీతమైన సమయం అంటూ ఉండదని.. సినీ కార్మికులకు పండుగలు, పబ్బాలు, ఆదివారాలు ఉండవని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news