వీ మిస్ యూ యూవీ.. గుర్తు చేసుకున్న ప్రముఖ కంపెనీలు

-

యూవీ కెరీర్ లోనే అద్భుతమైన ప్రదర్శన అంటే ఆరు బంతుల్లో ఆరు సిక్స్ లు కొట్టడం. 2007లో జరిగిన ఐసీసీ టీ20 క్రికెట్ వరల్డ్ కప్ లో భాగంగా ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో యూవీ ఒక ఓవర్ లో సిక్స్ లు కొట్టి చరిత్ర సృష్టించాడు.

యువరాజ్ సింగ్.. ఓ సంచలనం. భారత క్రికెట్ చరిత్రలో యూవీకి కొన్ని పేజీలు ఉన్నాయి. ఆయన క్రికెట్ ప్రస్థానం ఎందరికో ఆదర్శపాయం.. స్ఫూర్తిదాయకం. ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి యువరాజ్ సింగ్ నిన్న గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో భారత్ క్రికెట్ అభిమానులంతా ఓసారి యూవీని గుర్తు చేసుకున్నారు. ఆయన క్రికెట్ లో సాధించిన విజయాలను గుర్తు చేసుకున్నారు. యూవీ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పేసరికి.. కొందరు క్రికెట్ అభిమానులైతే జీర్ణించుకోలేకపోయారు.

అయితే.. యూవీ కెరీర్ లోనే అద్భుతమైన ప్రదర్శన అంటే ఆరు బంతుల్లో ఆరు సిక్స్ లు కొట్టడం. 2007లో జరిగిన ఐసీసీ టీ20 క్రికెట్ వరల్డ్ కప్ లో భాగంగా ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో యూవీ ఒక ఓవర్ లో సిక్స్ లు కొట్టి చరిత్ర సృష్టించాడు. ఆరు బంతుల్లో ఆరు సిక్సులు కొట్టి తన సత్తాను ప్రపంచానికి చాటాడు.

అయితే.. యూవీ క్రికెట్ చరిత్ర జ్ఞాపకాలను ప్రముఖ కంపెనీలు గుర్తు చేసుకున్నాయి. వీ మిస్ యూ యూవీ… నిన్ను మిస్ అవడానికి 666666 కారణాలు ఉన్నాయి.. అంటూ ప్రముఖ ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ యాప్ స్పందించగా.. నీ జ్ఞాపకాలు మాతో ఎప్పుడూ పదిలంగా ఉంటాయి.. అంటూ ఫెవికల్ బ్రాండ్ స్పందించింది. నిన్ను ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాం అంటూ ప్రముఖ ఎయిర్ లైన్ సంస్థ ఇండిగో ట్వీట్ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news