IPL 2023 : ఫ్యాన్స్ కు బిగ్ షాక్..ఐపీఎల్ కు విదేశీ ప్లేయర్లు దూరం !

-

IPL 2023 : .ఐపీఎల్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్ తగిలింది. ఐపీఎల్ 2023 కు విదేశీ ప్లేయర్లు దూరం కానున్నారు. ఓ పక్క ఫ్రాంచైజీలు ఆటగాళ్ల రిటైయిన్, రిలీజ్, ట్రేడింగ్, మినీ వేలం కోసం సన్నాహకాల్లో బిజీగా ఉంటే, విదేశీ స్టార్లు ఒక్కొక్కరుగా లీగ్ నుంచి జారుకుంటున్నారు.

ఇప్పటికే కోల్కతా నైట్ రైడర్స్ హిట్టర్, ఇంగ్లాండ్ ఆటగాడు సామ్ బిల్లింగ్స్, టెస్ట్ క్రికెట్ కె తన మొదటి ప్రాధాన్యత అంటు లీగ్ నుంచి వైదొలగగా, తాజాగా ఆసిస్ స్టార్ ఆటగాళ్లు పాట్ కమిన్స్, ఆరోన్ పించ్, మిచెల్ స్టార్క్ దేశ విధులే తమకు ముఖ్యమంటూ లీగ్ కు డుమ్మా కొట్టనున్నారని సమాచారం. వచ్చే ఏడాది జరిగే యాషెస్ సిరీస్ కోసం ఫిట్ గా ఉండేందుకు వీరు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వీరిలో స్టార్క్ గతేడాదే ఐపిఎల్ తన అయిష్టతను వ్యక్తపరిచాడు.

Read more RELATED
Recommended to you

Latest news