ధోనీ రికార్డ్ కూడా బద్దలు కొట్టాడు…!

కెకెఆర్ మాజీ కెప్టెన్ దినేష్ కార్తీక్ ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్ లో సరికొత్త రికార్డ్ అందుకున్నాడు. బ్యాటింగ్ లో అతను డక్ అవుట్ అయినా సరే కీపింగ్ విషయంలో మాత్రం సూపర్ రికార్డ్ సాధించాడు. బెన్ స్టోక్స్‌ క్యాచ్ ను అందుకున్న కార్తిక్ ఐపీఎల్‌లో అత్యధిక క్యాచ్‌ పట్టుకున్న కీపర్ గా నిలిచాడు. తద్వారా ధోనీ రికార్డ్ ని బద్దలు కొట్టాడు.

ఈ మ్యాచ్ లో మొత్తం నాలుగు క్యాచ్ లు పట్టాడు. ఈ టోర్నీ లో అతను మొత్తం 110 క్యాచ్ లు పట్టుకున్నాడు. కెకెఆర్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించగలిగితే అతను మరిన్ని క్యాచ్ లు పట్టుకునే అవకాశం ఉంటుంది. సిఎస్‌కె కెప్టెన్ ఎంఎస్ ధోని ఐపిఎల్‌లో 109 క్యాచ్‌లు పట్టుకున్నాడు. ఈ జాబితాలో మూడవ స్థానంలో ఐపిఎల్‌లో 66 క్యాచ్‌లతో పార్థివ్ పటేల్, నమన్ ఓజా (65), రాబిన్ ఉతప్ప (58) ఉన్నారు.