ఆరంభంలో రెండు మ్యాచుల్లో విజయం సాధించిన రాజస్తాన్ రాయల్స్ జట్టు, ఆ తర్వాత రెండు మ్యాచుల్లోనూ ఘోర పరాజయం చవి చూసింది. బ్యాట్స్ మెన్ విఫలమవడంతో స్కోరు సరిగ్గా చేయలేకపొతుంది. దీనికి ముఖ్య కారణం కేవలం జోస్ బట్లర్, సంజూ సాంసన్ లపై ఆధారపడటమే అని అంటున్నారు. వారిద్దరూ తప్ప మిగతా బ్యాట్స్ మెన్ ఎవరూ సరిగ్గా పర్ ఫార్మ యట్లేదు. ఈ విషయమై గౌతమ్ గంభీర్ తనదైన కామెంట్లు చేసాడు.
అనుభవం ఉన్న రాబిన్ ఉతప్ప సైతం సరిగ్గా పర్ ఫార్మ్ చేయడం లేదు. నాకు తెలిసి ఉతప్ప ఫామ్ లో ఉన్నట్టు కనబడట్లేదు. ఈ సీజన్లో ఉతప్ప స్కోరు చూసుకుంటే 5,9,2,17 గా ఉంది. ఉతప్ప ఇలాంటీ స్కోరుని అస్సలు ఊహించలేం. ఉతప్పపై మంచి అంచనాలు ఉన్నాయి. మ్యాచు ఫినిష్ చేయగలడన్న నమ్మకం ఉంది. కానీ ప్రస్తుత పర్ఫార్మెన్స్ చూస్తుంటే ఉతప్ప ఫామ్ లో లేనట్లుగా ఉంది. అతడే కాదు రియాన్ పరాగ్ కూడా అంతే. వీరిద్దరికీ సమయం ముగిసిపోయిందని చెప్పుకొచ్చాడు.