ఫిబ్రవరి 2012… అంతర్జాతీయ క్రికెట్ లో టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అసలు మరువలేని నెల. ఆస్ట్రేలియా, శ్రీలంక, ఇండియా ముక్కోణ వన్డే టోర్నీ ఆడుతున్నాయి. టీం ఇండియా ఫైనల్ కి వెళ్ళాలి అంటే కచ్చితంగా భారీ విజయం సాధించాలి. రన్ రేట్ పరంగా టీం ఇండియా వెనుకబడి ఉంది. హోబర్ట్‌లో శ్రీలంక, ఇండియా మధ్య మ్యాచ్ లో శ్రీలంక మొదట బ్యాటింగ్ చేసి… తిల్లకరత్నే దిల్షాన్ భారీ సెంచరీ… (160) కి 320 పరుగులు సాధించింది.
దీనితో టీం ఇండియా 40 ఓవర్లలో 321 పరుగులు చేయాల్సి ఉంది. ఈ తరుణంలో కోహ్లీ చెలరేగిపోయాడు. లసిత్ మలింగ టార్గెట్ గా చెలరేగిపోయాడు. లాసిత్ మలింగ బౌలింగ్ చేసిన ఒక ఓవర్లో 24 పరుగులతో సహా 133 పరుగులు చేశాడు. భారత్ కేవలం 37 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించగలిగింది. అయితే ఫైనల్ లో మాత్రం టీం ఓటమి పాలైంది.