IND vs NZ: తొలి వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

-

మూడు వన్డేల సిరీస్ తో భారత్ – న్యూజిలాండ్ జట్లు పోరుకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ 3 వన్డేల సిరీస్ లో మొదటి వన్డే హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో ఇరిజట్లు సమరానికి సిద్ధమయ్యాయి. తొలి వన్డేలో భారత జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. జట్ల విషయానికి వస్తే వెన్నెముక గాయంతో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ శ్రేయస్ అయ్యర్ ఈ సిరీస్ మొత్తానికి దూరమైన విషయం తెలిసిందే. మరోవైపు పెళ్లి కారణంగా కేఎల్ రాహుల్ టీం కి దూరమయ్యారు.

ఈ తొలి వన్డేలో జట్ల వివరాలు ఇవే..

న్యూజిలాండ్ (ప్లేయింగ్ XI): ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (w/c), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్, హెన్రీ షిప్లీ, లాకీ ఫెర్గూసన్, బ్లెయిర్ టిక్నర్.

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(సి), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్(w), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ.

Read more RELATED
Recommended to you

Latest news