ఇండియా వర్సెస్ పాకిస్తాన్, టార్గెట్ ఎంత అంటే…!

-

అండర్ 19 ప్రపంచకప్ లో భాగంగా భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఇరు జట్లు కూడా మంచి ప్రదర్శనతో సెమి ఫైనల్ లో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ కి టీం ఇండియా కుర్రాళ్ళు చుక్కలు చూపించారు. ఎక్కడా కూడా పాకిస్తాన్ కి అవకాశం ఇవ్వకుండా చెలరేగిపోయారు. యువ భారత్ ధాటికి పాకిస్తాన్ జట్టు కుదేలు అయిపోయింది.

తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 43.1 ఓవర్లలోనే ఆల్ అవుట్ అయింది. ఓపెనర్ హైదర్ అలీ, కెప్టెన్ రోహిల్ నజీర్ అర్ధ సెంచరీలతో జట్టుని ఆదుకున్నారు. ఇక చివరలో మహ్మద్ హారిస్ మినహా అందరూ సింగల్ డిజిట్ స్కోర్ కే పరిమితం అయ్యారు. దాదాపు ఆ ఇద్దరు 60 పరుగుల భాగస్వామ్యంతో జట్టుని ఆదుకున్నారు. వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ జట్టు స్కోర్ బోర్డు ని పెంచుకుంటూ వచ్చారు.

అయితే కీలక సమయంలో ఆ ఇద్దరు అవుట్ కావడంతో కనీసం 200 పరుగులు అయినా చేస్తుంది అనుకున్న దాయాది 173 పరుగులకే ఆల్ అవుట్ అయింది. భారత బౌలర్లలో సుశాంత్ మిశ్రా, మూడు వికెట్లు తీయగా రవి బిష్ణోయ్, కార్తిక్ త్యాగి తలో రెండు వికెట్లు, అన్కోలేకర్, జైస్వాల్ తలో వికెట్ తీసారు. ప్రస్తుతం భారత్ రెండు ఓవర్లకు గాను 12 పరుగులు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news