భారత్​ పతకాల జోరు.. టీటీలో గోల్డ్​.. వెయిట్​ లిఫ్టింగ్​లో సిల్వర్​

-

బర్మింగ్​హామ్​ వేదికగా జరుగుతున్న కామన్​వెల్త్​ గేమ్స్​లో భారత్​ అదరగొడుతోంది. ఆటల ఐదో రోజు(మంగళవారం) జోరు మీద ఉంది. ఇప్పటికే ఇవాళ రెండు స్వర్ణాలు, ఒక రజతం భారత్​ ఖాతాలో చేరాయి.

భారత పురుషుల టేబుల్​ టెన్నిస్​ టీం పసిడితో మెరిసింది. సింగపూర్​పై 3-1 తేడాతో గెలుపొందింది. దీంతో.. భారత్​ ఖాతాలో ఐదో గోల్డ్​ చేరింది. వెయిట్​ లిఫ్టింగ్ పురుషుల 96 కేజీల విభాగంలో.. భారత స్టార్​ వికాస్​ ఠాకుర్​ సిల్వర్​ గెలుపొందాడు. మొత్తం 346 కిలోల బరువును ఎత్తి.. రెండో స్థానంలో నిలిచాడు.​ దీంతో కామన్​వెల్త్​ గేమ్స్​లో భారత​ మొత్తం పతకాల సంఖ్య 12కు (గోల్డ్ 5, రజతం 4, కాంస్యం 3) చేరింది.

మంగళవారమే.. లాన్ బౌల్స్​లో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. కామన్​వెల్త్ గేమ్స్​లో తొలిసారి స్వర్ణ పతకం గెలుచుకుంది. ఫైనల్​లో దక్షిణాఫ్రికాపై 17-10 తేడాతో గెలిచింది భారత్.​ లవ్లీ చౌబే, రూపా రాణి, పింకీ, నయన్​మోని సైకియాలతో కూడిన భారత లాన్ బౌల్స్ బృందం ఈ ఘనత సాధించింది.

సోమవారం న్యూజిలాండ్‌ను ఓడించి వీరు ఫైనల్‌కు చేరారు. ఈ క్రమంలోనే బుధవారం తుదిపోరులో దక్షిణాఫ్రికాను చిత్తుచేసిన ఈ బృందం ఈ కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత్‌కు మరో పసిడి పతకం కొల్లగొట్టింది.

Read more RELATED
Recommended to you

Latest news