BREAKING : భారత క్రికెటర్ రిటైర్మెంట్

-

టీమిండియా క్రికెటర్ రాబిన్ ఉతప్ప రిటైర్మెంట్ ప్రకటించాడు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ట్వీట్ చేశాడు. దేశం, కర్ణాటక తరఫున ప్రాతినిధ్యం వహించడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపాడు.

20 ఏళ్ల తన క్రికెట్ ప్రయాణంలో సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లుగా ఉతప్ప ట్వీట్ చేశాడు. రాబిన్ ఉతప్ప భారత్ తరఫున 46 వన్డేలు, 13 టీ20లు ఆడాడు. ఫాస్ట్ బౌలింగ్ లోనూ ముందుకొచ్చి ఈజీగా సిక్సర్లు కొట్టడం ఈ ఆటగాడి ప్రత్యేకత.

“నేను క్రికెట్​ ఆడటం ప్రారంభించి 20 ఏళ్ల అవుతుంది. ఇన్నేళ్ల పాటు ఈ దేశానికి, నా రాష్ట్రం కర్ణాటకకు ప్రాతినిధ్యం వహించడం గర్వంగా భావిస్తున్నా. ఈ అద్భుతమైన ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నాను. ఈ ప్రయాణం నన్ను మనిషిగా పరిపూర్ణం చేసింది. అయితే వీటన్నిటికీ వీడ్కోలు పలికే సమయం వచ్చింది. అందుకే క్రికెట్​ నుంచి రిటైర్​మెంట్ ప్రకటిస్తున్నా. జీవితంలో కొత్త శకాన్ని ఆరంభించబోతున్నా ” అని ట్విట్టర్​లో పేర్కొన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news