కూకట్‌పల్లి వై జంక్షన్ వద్ద ఉన్న 540 ఎకరాలపై సుప్రీం కీలక తీర్పు

-

హైదరాబాద్ నడిబొడ్డున కూక‌ట్‌పల్లి వై జంక్షన్ వద్దనున్న అత్యంత విలువైన 540.30 ఎక‌రాల స్థలంపై పూర్తి హక్కులు దేవాదాయ శాఖ ప‌రిధిలో ఉన్న ఉదాసిన్ మ‌ఠానివేనని సుప్రీంకోర్టు తేల్చింది. ఉదాసిన్ మ‌ఠం, గ‌ల్ఫ్ ఆయిల్ కార్పొరేష‌న్ – ఐడీఎల్‌ కెమిక‌ల్స్ కేసులో సర్వోన్నత న్యాయస్థానం ఈ మేరకు ఇవాళ తీర్పు వెలువరించింది.

Indian Supreme Court

కూక‌ట్‌ప‌ల్లి వై జంక్షన్ వద్ద ఉన్న ఉదాసిన్ మ‌ఠం భూముల‌ను 1964, 1966, 1969, 1978లో నాలుగు ద‌ఫాలుగా బ‌ఫ‌ర్ జోన్ ఉన్న గల్ఫ్ ఆయిల్ కార్పొరేష‌న్‌కు 99 ఏళ్ల కాల వ్యవధికి లీజు ఇచ్చింది. అయితే బ‌ఫ‌ర్ జోన్‌లో ఉన్న ఈ భూముల్లో గ‌ల్ఫ్ ఆయిల్ కార్పొరేష‌న్ 538 ఎక‌రాల విస్తీర్ణంలో రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ప్రారంభించడాన్ని సవాల్‌ చేస్తూ ఉదాసిన్ మ‌ఠం దేవాదాయ శాఖ ట్రైబ్యున‌ల్‌ను ఆశ్రయించింది.

పిటిష‌న్ విచారించిన ట్రైబ్యున‌ల్.. గ‌ల్ఫ్ ఆయిల్ కార్పొరేష‌న్‌కు ఇచ్చిన లీజును 2011లో ర‌ద్దు చేసింది. ట్రైబ్యున‌ల్ తీర్పును స‌వాల్‌ చేస్తూ గ‌ల్ఫ్ ఆయిల్ కార్పొరేష‌న్ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేయ‌గా.. 2013లో డిస్మిస్ చేశారు. హైకోర్టు తీర్పును స‌వాల్‌ చేస్తూ గ‌ల్ఫ్ ఆయిల్ కార్పొరేష‌న్ సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసింది. యాధాతథస్థితి కొనసాగించాలని 2013లో సుప్రీంకోర్టు ఆదేశించింది. పిటిషన్‌పై ఇవాళ తీర్పు వెలువరించిన సర్వోన్నత న్యాయస్థానం.. గ‌ల్ఫ్ ఆయిల్ కార్పొరేష‌న్ దాఖలు చేసిన పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news