వర్షాకాలంలో జలుబు చేయడం సహజం.. త్వరగా తగ్గిపోవాలని ఆవిరి పట్టడం కూడా కామన్.. అయితే చిన్నపిల్లలకు జలుబు చిన్న సమస్య కాదు.. చాలా ఇబ్బంది పెడుతుంది. దాంతో యాంటిబయాటిక్స్, నెబులైజర్ పెట్టడం వంటివి చేస్తుంటారు. ఇలా చేయకూడదని నిపుణులు అంటున్నారు. ఎందుకు ఏమైతది.. మంచిదేగా.. జలుబు త్వరగా తగ్గిపోతుందనే కదా మనం వాటిని వాడుతుంటాం…మరి వైద్యులు ఎందుకు వద్దంటున్నారో చూద్దామా..!
అధికంగా యాంటీ బయాటిక్స్ వాడకం వద్దు
జ్వరం ఉంటే పారాసెటమాల్ వేయాలి.. ఇది గొంతు నొప్పికి కూడా తగ్గిస్తుంది. అవసరమైతే పెద్ద పిల్లలు OTC యాంటీ-అలెర్జీ మందులను ఉపయోగించవచ్చు. నాలుగు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు OTC దగ్గు, జలుబు మందులు డాక్టర్ సిఫార్సు లేకుండా అసలు వాడొద్దు.. డయాబెటిక్ మందులు వెంటనే వేయొద్దు.. వైద్యులని సంప్రదించకుండా అధికంగా యాంటీబయాటిక్స్ వాడటం వల్ల పిల్లల్లో సైడ్ ఎఫ్ఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది.
నెబులైజర్ బదులు ఆవిరి మంచిది..
జలుబు వల్ల ముక్కు బిగుసుకుని ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉందని నెబులైజర్ పెట్టేస్తారు. అయితే అలా చెయ్యకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సెలైన్ నోస్ స్ప్రే మాత్రమే వినియోగించాలట. పిల్లలకి ఆవిరి పీల్చడం అలవాటు చేయండి.. గోరువెచ్చని నీటితో పిల్లవాడికి ఆవిరి పట్టొచ్చు. అయితే ఇందులో ఎటువంటి మందులు కలపాల్సిన అవసరం లేదు. ఆవిరి తర్వాత పిల్లలను కొద్ది సేపు గది నుంచి బయటకి రాకుండా చూసుకోండి.. ఆవిరి పట్టడం వల్ల ముక్కుదిబ్బడ తగ్గుతుంది.
స్ట్రీమ్ ఇన్ హెలేషన్ వల్ల పిల్లలకి హాయిగా అనిపిస్తుంది. విపరీతమైన దగ్గు వచ్చిన సమయంలో మాత్రమే నెబులైజర్ పెట్టాలి. అది కూడా డాక్టర్ సలహా తీసుకున్న తర్వాతనే దాన్ని ఉపయోగించాలని నిపుణులు అంటున్నారు.
వెల్లుల్లి, ఆవ నూనె కలిపి బాగా మరిగించి చల్లారిన తర్వాత దాన్ని పిల్లల శరీరం మొత్తం పట్టించి మసాజ్ చెయొచ్చు.. ఇలా చేస్తే శరీరంలో ఉన్న వేడి కూడా తగ్గుతుంది. ద్రవ పదార్థాలు ఎక్కువగా ఇవ్వడం వల్ల పిల్లల శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది. ఈ చిట్కాలు పాటించడం వల్ల పిల్లల్లో జలుబు త్వరగా తగ్గిపోతుంది.