ఐపిఎల్ 2023: బెంగళూర్ తో లక్నో “ఢీ”… గెలుపు అవకాశాలు ఎవరికి ఎక్కువ! 

-

లక్నో వేదికగా ఈ రోజు మరి కాసేపట్లో లక్నో సూపర్ జయింట్స్ మరియు రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ జట్ల మధ్యన మ్యాచ్ జరగనుంది. గత మ్యాచ్ లో లక్నో పంజాబ్ పై విజయం సాధించగా, బెంగళూర్ మాత్రం కోల్కతా చేతిలో ఘోరపరాజయాన్ని ఎదుర్కొంది. దీనితో ఈ మ్యాచ్ లో బెంగళూర్ ఒత్తిడితో బరిలోకి దిగనుంది. అయితే బెంగళూర్ విజయావకాశాలు మాత్రం కోహ్లీ, మాక్స్ వెల్ మరియు డుప్లిసిస్ ల మీదనే ఆధారపడి ఉంది. ఇక బౌలింగ్ లో సిరాజ్ మరియు హసరంగ లు మినహా ఎవ్వరూ ఆకట్టుకోవడం లేదు. మరోవైపు లక్నో మాత్రం అన్ని విభాగాలలో చాలా పటిష్టంగా ఉందని చెప్పాలి.

బ్యాటింగ్ లో రాహుల్, మేయర్స్, స్టాయినిస్, పూరన్ లు ఆకట్టుకుంటున్నారు. ఇక బౌలింగ్ లో నవీన్ ఉల్ హక్, రవి బిష్ణోయ్ మరియు ఆవేష్ ఖాన్ లు రాణిస్తున్నారు. ఒక ఈ రోజు మ్యాచ్ లో బెంగళూర్ కన్నా లక్నో కు గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఏమి జరుగుతుందో తెలియాలంటే మ్యాచ్ ముగిసే వరకు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news