ఒకప్పుడు నంది అవార్డుల కార్యక్రమం అంటే ఓ పండుగలా ఉండేది : అశ్వనీదత్

-

రాష్ట్ర విభజన జరిగాక నంది అవార్డుల వ్యవహారం నిరాదరణకు గురవుతోందని ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ స్పందించారు. ఒకప్పుడు తెలుగు చిత్రసీమలో నంది అవార్డుల కార్యక్రమం అంటే ఓ పండుగలా జరిగేది. నంది అవార్డు గ్రహీతలకు ఎంతో గుర్తింపు, గౌరవం లభించేవి. కానీ రాష్ట్ర విభజన జరిగాక నంది అవార్డుల వ్యవహారం నిరాదరణకు గురవుతోంది. “ఇప్పుడు నడుస్తున్న నంది అవార్డుల సీజన్ వేరు… ఉత్తమ గూండా, ఉత్తమ రౌడీ అంటూ వాళ్లకు అవార్డులు ఇస్తారు. ఇవి సినిమాలకు అవార్డులు ఇచ్చే రోజులు కావు.

Ashwini Dutt Comments on AP Govt And Nandi Awards | ఉత్తమ గూండా, ఉత్తమ రౌడీ  లాంటివి ఇస్తారు.. ఏపీ ప్రభుత్వంపై అశ్వనీదత్ సెటైర్లు News in Telugu

సినిమాలకు నంది అవార్డులు ఇచ్చే రోజులు రావాలంటే రెండు మూడేళ్లు పడుతుంది. అప్పుడు మనందరం అవార్డులు అందుకోవచ్చు” అని అశ్వనీదత్ వ్యాఖ్యానించారు. దీనిపై హైదరాబాదులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అశ్వనీదత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగానే ఆయన నంది అవార్డులపై వ్యాఖ్యలు చేయడం జరిగింది. సూపర్ స్టార్ కృష్ణ నటించిన అలనాటి బ్లాక్ బస్టర్ చిత్రం మోసగాళ్లకు మోసగాడు 4కే టెక్నాలజీ హంగులు దిద్దుకుంది. త్వరలో ఈ చిత్రాన్ని 4కేలో విడుదల చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news