IPL 2023 : రవీంద్ర జడేజా ఒకే ఓవర్లో 2 వికెట్లు.. శాంసన్ డక్ అవుట్ !

-

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ రాజస్థాన్ స్పీఎందుకు బ్రేక్ వేసే పనిలో ఉంది. ఫామ్ లో ఉన్న జైస్వాల్ ను త్వరగానే అవుట్ చేసినా బట్లర్ మరియు పడిక్కల్ ఆటలో వేగం పెంచారు. ఓవర్ కు 10 పరుగుల చొప్పున పిండుకుంటున్న రాజస్థాన్ ను తొమ్మిదవ ఓవర్ లో బౌలింగ్ కు వచ్చిన లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ రవీంద్ర జడేజా మూడవ బంతికి పడిక్కల్ ను అవుట్ చేశాడు. అదే ఓవర్ లో అయిదవ బంతికి కెప్టెన్ సంజు శాంసన్ ను డక్ అవుట్ చేశాడు. దీనితో ఒక్కసారిగా రాజస్థాన్ రాయల్స్ జోరు తగ్గిందని చెప్పాలి.

ఊపుమీదున్న పడిక్కల్ ను మరియు డేంజరస్ ఆటగాడు సంజు శాంసన్ ను ఒకే ఓవర్ లో అవుట్ చేసి చెన్నై కు డబుల్ బ్రేక్ ఇచ్చాడు. కాగా అప్రస్తుతం క్రీజులో బట్లర్ మరియు అశ్విన్ లు ఆడుతున్నారు. మరి చూద్దాం రాజస్థాన్ ఎంత వరకు స్కోర్ చేస్తుందో ?

Read more RELATED
Recommended to you

Latest news