మహారాష్ట్ర నాగపూర్ లో జరిగిన రెండో టి20 ఇంటర్నేషనల్ లో భారత్ అద్భుత విజయాన్ని అందుకుంది. ఆరు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియన్లను మట్టి కరిపించింది. వర్షం వల్ల ఆలస్యంగా ప్రారంభమైన ఈ మ్యాచ్ భారత బ్యాటర్ల సత్తా చాటింది. వర్షం కారణంగా మ్యాచ్ ను 8 ఓవర్లకు కుదించడంతో బుమ్రా కు కేవలం రెండు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసే అవకాశం వచ్చింది.
అయినప్పటికీ బుమ్రా తన మార్క్ ను చూపించాడు. 2 ఓవర్లు వేసిన బుమ్రా 23 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. అయితే ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ ను అవుటు చేసిన తీరు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బుమ్రా వేసిన యార్కర్ కు 15 బంతుల్లో 31 పరుగులతో దాటిగా ఆడుతున్న ఫించ్ వద్ద సమాధానం లేకుండా పోయింది.
బుమ్రా ను ఎందుకు యార్కర్ల కింగ్ గా పిలుస్తారో ఫించ్ కు వేసిన డెలివరీని చూస్తే మీకు అర్థమవుతుంది. అందుకే ప్రత్యర్థి జట్టు కెప్టెన్ అయిన ఫించ్ బుమ్రా ను మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. పెవీలియన్ వెళ్తూ “సూపర్ డెలివరీ” అన్న తరహాలో తన బ్యాట్ ను చేతితో కొట్టిన ఫించ్ అతనిని అభినందించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
That searing delivery from Bumrah and the applause from Finch! 🙌🏽👏🏽 pic.twitter.com/E4RBVvybaJ
— Vijay (@VijaySh09797062) September 23, 2022