డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో సినిమా వస్తుందంటే చాలు ఎక్కువగా మాస్ ఎలివేషన్ ఉంటాయని చెప్పవచ్చు. ఇక బాలకృష్ణ వివి వినాయక్ కాంబినేషన్లో వచ్చిన చెన్నకేశవరెడ్డి సినిమా ప్రేక్షకులను బాగా మెప్పించింది. వివి వినాయక్ తెరకెక్కించిన మొదటి సినిమా ఆది.. ఇది బ్లాక్ బాస్టర్ విజయం కావడంతో ఇండస్ట్రీలోని హీరోలు సైతం ఈ డైరెక్టర్ తో సినిమా చేయడానికి చాలా ఆత్రుతగా ఉండేవారు. అలా బాలకృష్ణకి కూడా ఈ దర్శకుడితో సినిమా చేయాలని ఆశ పుట్టిందట.
దాంతో వేరొక డైరెక్టర్ తో సినిమా తీయాలనుకున్నప్పుడు ఆ సినిమాని పక్కన పెట్టి మరి అవకాశం ఇచ్చారు బాలకృష్ణ. ఇక ఈ చిత్రానికి నిర్మాతగా బెల్లంకొండ సురేష్ వ్యవహరించారు. సంగీతాన్ని మాత్రం మణిశర్మ అందించారు. ఈ చిత్రానికి పరుచూరి రైటర్స్ అందించిన డైలాగ్స్ బాలయ్య నటన డ్యూయల్ రోల్ ఈ సినిమాకి ప్లస్సుగా మిగిలాయని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీయ మరియు సీనియర్ హీరోయిన్ టబు నటించారు. అయితే ఈ సినిమాలో బాలయ్య చెల్లెలి పాత్ర కోసం కొంతమంది హీరోయిన్లను సంప్రదించారు .కానీ వారు రిజెక్ట్ చేసినట్లుగా తెలుస్తోంది వాటి గురించి చూద్దాం.
బాలకృష్ణ చెల్లెలి పాత్రలో హీరోయిన్ దేవయాని ఈ సినిమాలో నటించింది. ఇక ఈ సినిమాలో ముందుగా ఈమె పాత్రలో వివి వినాయక్ కొంతమందిని అడిగినట్లుగా తెలుస్తోంది. అందులో ముఖ్యంగా హీరోయిన్ లయని సంప్రదించగా.. ఇతర సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న కారణం చేత బాలయ్య సోదరి పాత్రలో నటించలేనని చెప్పిందట.
ఇక మరొక హీరోయిన్ ఎవరంటే సౌందర్య. తనకంటే పెద్ద హీరోలకు తల్లి గా చేస్తే ఆ తర్వాత ఎక్కువగా అలాంటి పాత్రలే వస్తాయని సౌందర్య కూడా రిజెక్ట్ చేసినట్లు సమాచారం. ఇక వీరే కాకుండా ఇతర హీరోయిన్లు కూడా ఈ సినిమా రిజెక్ట్ చేసినట్లుగా తెలుస్తోంది.