ఐపీఎల్‌ 2021… విండీస్ ఆటగాళ్ళ రాకకు లైన్ క్లియర్

-

కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో ఐపీఎల్‌ 14వ సీజన్ అర్ధాంతరంగా నిలిచిపోయిన విషయం తెల్సిందే. అయితే టోర్నీలో 29 మ్యాచులే జరగగా మిగిలిన మ్యాచ్ లను సెప్టెంబర్‌ 19 నుంచి అక్టోబర్‌ 15 వరకు యూఏఈలో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. కాగా ఐపీఎల్‌ రెండో దశ మ్యాచ్ లకు టోర్నీలో పాల్గొనే విదేశీ ఆటగాళ్లు అందరూ అందుబాటులో ఉండే అవకాశం లేదు.

ఐపీఎల్‌/ IPL

ఆయా దేశాలకు ద్వైపాక్షిక సిరీసులు ఉండడంతో ఆటగాళ్ళను సదరు బోర్డులు ఐపీఎల్‌లో ఆడేందుకు వెళ్ళడానికి అనుమతి ఇవ్వడం లేదు. దీంతో ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్‌ క్రికెటర్లు ఐపీఎల్‌లో ఆడేందుకు యూఏఈకి వచ్చే అవకాశాలు దాదాపు లేనట్లే. అయితే జాతీయ జట్టుకు ఎంపికవ్వని ఆటగాళ్ళు మాత్రం ఐపీఎల్‌లో ఆడేందుకు ఆయా దేశాల క్రికెట్ బోర్డులు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది.విదేశీ స్టార్లు లేకుంటే ఐపీఎల్‌లో కాస్త కిక్ తగ్గే అవకాశం ఉంది. దీంతో వీలైనంత మంది విదేశీ ఆటగాళ్ళు టోర్నీలో పాల్గొనేందుకు బీసీసీఐ ప్రయత్నాలు చేస్తుంది.

ఇందులో భాగంగా వెస్టిండీస్‌ క్రికెటర్లను రప్పించేందుకు బీసీసీఐ చేసిన ప్రయత్నం ఫలించింది. కాగా ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్‌ 19 వరకు కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ను (సీపీఎల్‌) నిర్వహించాలని విండీస్ బోర్డు ముందుగా నిర్ణయించింది. దీంతో విండీస్ ఆటగాళ్ళు ఐపీఎల్‌కు వచ్చేందుకు అవకాశం లేకపోయింది. ఈ నేపథ్యంలో సీపీఎల్‌ను కొన్నిరోజులు ముందే నిర్వహించాలని బీసీసీఐ కోరగా… బీసీసీఐ అభ్యర్ధనను కష్టమని విండీస్ బోర్డు ముందుగా ప్రకటించింది. అయితే తాజాగా తేదీలను ముందుకు జరిపేందుకే విండీస్ బోర్డు మొగ్గు చూపినట్లు తెలిసింది. దీంతో ఐపీఎల్‌ రెండో దశ మ్యాచ్ లు ఆడేందుకు విండీస్ ఆటగాళ్ళ లైన్ క్లియర్ అయింది.

Read more RELATED
Recommended to you

Latest news