మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్-2023లో భారత్ అమ్మాయిల పంచ్ అదిరింది. భారత్‌కు మరో రెండు సిల్వర్ మెడల్స్ ఖాయమయ్యాయి. ఈ మెగాటోర్నీలో డిఫెండింగ్ ఛాంప్‌గా బరిలోకి దిగిన భారత స్టార్ బాక్సర్, తెలంగాణ పిల్ల నిఖత్ జరీన్ తన పర్ఫామెన్స్ తో అదరగొడుతోంది. రింగ్‌లో పవర్ఫుల్ పంచ్‌లతో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తోంది. మహిళల 50 కేజీల విభాగంలో పోటీపడుతున్న నిఖత్.. ఇప్పటికే సెమీ ఫైనల్ చేరుకుని పతకాన్ని ఖాయం చేసుకుంది.
అయితే గురువారం రోజున కూడా సెమీఫైనల్ బౌట్‌లో కూడా తన పవర్ పంచ్‌ను చూపించింది. బలమైన పంచ్‌లతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసింది. కొలంబియన్ బాక్సర్ ఇంగ్రిట్ లొరెనా వాలెన్సియా విక్టోరియాపై 5-0 తేడాతో అద్భుత విజయం సాధించింది. తద్వారా ఫైనల్‌కు అర్హత సాధించింది. ఇక ఈ ఫైనల్లో విజయం సాధిస్తే స్వర్ణ పతకాన్ని తన ఖాతాలో వేసుకుంటుంది. ఈ ఛాంపియన్‌షిప్ లో నీతు గాంగాస్ (48 కేజీ), లవ్లీనా (75 కేజీ), స్వీటీ బూర (81 కేజీ) కూడా ఫైనల్స్‌లో అడుగుపెట్టారు.