బంగ్లాదేశ్ కెప్టెన్, స్టార్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హాసన్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశాడు. వన్డే జట్టు పగ్గాలు చేపట్టానని.. ఇది కేవలం టీమ్ ప్రయోజనాల దృష్ట్యా మాత్రమే తీసుకున్న నిర్ణయమని పేర్కొన్నాడు. తన స్వార్థం కోసం సారథిగా రాలేదంటూ నర్మ గర్భ వ్యాఖ్యలు చేశాడు. మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ కెప్టెన్సీ చేపట్టిన నేపథ్యంలో షకీబ్ అల్ హాసన్ వన్డే కెప్టెన్సీ చేపట్టిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో ఆసియా కప్ 2023లో జట్టును ముందుడి నడిపించాడు షకీబ్ అల్ హాసన్.
ప్రపంచ కప్ టోర్నీలోనూ సారథిగా వ్యవహరించనున్నాడు. ఈ తరుణంలో ఆయన మాట్లాడుతూ.. వన్డే కెప్టెన్సీ రిటైర్మెంట్ గురించి తన ప్రణాళికలను వెల్లడించాడు. అంతర్జాతీయ స్థాయిలో నేను 2025 వరకు కొనసాగే అవకాశముంది. వన్డే ఫార్మాట్ ఛాంపియన్ ట్రోపీలో భాగమవ్వాలనుకుంటున్నట్టు వెల్లడించాడు. టీ-20 ఫార్మాట్ లో టీ 20 ప్రపంచ కప్ 2024 వరకు జట్టుతో ఉండాలనుకుంటున్నట్టు వెల్లడించారు. టెస్ట్ లవిషయంలో వరల్డ్ కప్ తరువాత నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నట్టు వెల్లడించారు. ఒకేసారి అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలుకే అవకాశాలు కనిపిస్తున్నాయి.