రోహిత్ గాయం ఆ బుడ్డోడి అద్రుష్టం…!

-

కివీస్ తో జరిగిన 5 మ్యాచుల టి20 సీరీస్ ని క్లీన్ స్వీప్ చేసి దూకుడు మీదున్న టీం ఇండియాకు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టుతో జరిగే వన్డే టెస్ట్ సీరీస్ కి రోహిత్ గాయం కారణంగా దూరమయ్యాడు. వివరాల్లోకి వెళితే ఆదివారం జరిగిన 5వ మ్యాచ్ లో రోహిత్ పరుగు తీస్తున్న సమయంలో కాలు బెణికింది. దీనితో 60 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రోహిత్ రిటైర్డ్ హర్ట్ గా వెనుతిరిగాడు.

గాయాన్ని పరిశీలించిన డాక్టర్లు… విశ్రాంతి అవసరమని చెప్పడంతో దీనిపై బోర్డ్ కీలక ప్రకటన చేసింది. ఈ నేపధ్యంలో అతను టెస్ట్, వన్డే సీరీస్ కి దూరమైనట్టు బోర్డ్ ప్రకటించింది. ఇప్పటికే ధావన్ కి కూడా గాయమైన నేపధ్యంలో యువ ఆటగాడు ప్రిథ్వి షా ని జట్టుకి ఎంపిక చేసారు. రోహిత్ ఉండి ఉంటే పృథ్వీ కి తుది జట్టులో స్థానం దక్కేది కాదు. ఓపెనర్ గా టెస్టుల్లో కూడా రోహిత్ తన సత్తా చూపించాడు.

దీనితో కెఎల్ రాహుల్ కి జతగా పృథ్వీ ఇన్నింగ్స్ ఓపెన్ చేసే అవకాశం ఉంది. ఇటీవల డోపింగ్ తో పృథ్వీ నిషేధానికి గురయ్యాడు. ఇప్పుడు రోహిత్ గాయం రూపంలో ఈ 19 ఏళ్ళ బుడ్డోడికి మంచి వరం వచ్చింది. దీనితో కోహ్లీ అతనిని ఏ విధంగా వాడుకుంటాడు అనేది చూడాల్సి ఉంది. ఇప్పటికే పృథ్వీ టెస్ట్ జట్టులో తాను ఏంటీ అనేది ప్రూవ్ చేసుకున్నాడు. ఇక వన్డేల్లో అవకాశ౦ వస్తే ఏ స్థాయిలో ఆకట్టుకు౦టాడో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news