Punjab Kings vs Mumbai Indians, 33rd Match: ఐపీఎల్ 2024 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ మరో కీలక పోరు జరగనుంది. పాయింట్స్ టేబుల్ లో కింది స్థానాల్లో ఉన్న పంజాబ్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య ఇవాళ 33వ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ చండీగఢ్ లోని మహారాజా యాదవేంద్ర సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఇవాళ రాత్రి ప్రారంభమవుతుంది.
రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ఇవాళ జరిగే మ్యాచ్ శిఖర్ ధావన్ అందుబాటులో ఉంటాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ దావన్ ఆడకపోతే… సామ్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. అటు ముంబై పరిస్థితి కూడా చాలా దారుణంగా తయారయింది. టోర్నమెంట్ మొత్తంలో రెండు విజయాలను అందుకున్న ముంబై… ఇవాళ మ్యాచ్లో ఎలాగైనా గెలవాలని కసరత్తు చేస్తోంది.