Rohit Sharma and co stuck in Barbados : బార్బడోస్‌లో భారత జట్టు చిక్కుకుంది. తుపాను వల్ల భారత జట్టు బార్బడోస్‌లో చిక్కుకుంది. ఇక్కడ వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో తుపాను హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలో ముందు జాగ్రత్తతో అక్కడి అధికార యంత్రాంగం బార్బడోస్ విమానాశ్రయాన్ని మూసివేసింది.
దీంతో ఆటగాళ్లందరూ హోటల్ గదుల్లోనే ఉండి పోయారు. పరిస్థితులు మెరుగయ్యే వరకు భారత జట్టు అక్కడే ఉండనున్నట్లు తెలుస్తోంది. కాగా వరల్డ్కప్ ట్రోఫీ నెగ్గి 17 ఏళ్ల తర్వాత పొట్టి కప్ను ముద్దాడిన టీమ్ఇండియా సంబురాల్లో మునిగిపోయింది. ఈ జట్టుకు ప్రపంచ వ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక సోషల్ మీడియాలో టీమిండియా గెలుపు జోరు మామూలుగా లేదు. ఇక దేశవ్యాప్తంగా క్రికెట్ ఫ్యాన్స్ రోడ్లపైకి వచ్చి మామూలుగా సందడి చేయలేదు.