సచిన్ కు పెళ్లి పత్రిక అందించిన పివి సింధు !

-

సచిన్ టెండూల్కర్ ను కాబోయే పివి సింధు దంపతులు కలిసారు. ఈ సందర్భంగా సచిన్ టెండూల్కర్ ను కలిసి పెళ్లి పత్రిక అందించారు పివి సింధు దంపతులు. దీనికి సంబంధించిన ఫోటో నెట్టింట వైరల్‌ గా మారింది.

Sachin Tendulkar was met by PV Sindhus future couple

కాగా, భారత స్టార్ బ్యాట్మెంటన్ ప్లేయర్ పీవీ సింధు త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. హైదరాబాద్ మహానగరానికి చెందిన ఓ బిజినెస్ మాన్ ను పెళ్లి చేసుకోబోతున్నారు పీవీ సింధు. హైదరాబాద్ కు చెందిన వెంకట దత్త సాయి అనే బిజినెస్ మాన్ తో ఏడు అడుగులు వేయనున్నారు పీవీ సింధు.

ఇక ఈనెల 22వ తేదీన.. పీవీ సింధు వివాహం జరగబోతుందని సమాచారం అందుతుంది. ఉదయపూర్ లో గ్రాండ్గా పీవీ సింధు వివాహం జరగనుందట. ఇక ఈనెల 24వ తేదీన హైదరాబాదులో రిసెప్షన్ కూడా నిర్వహించబోతున్నారట. ఇక పెళ్ళికొడుకు వెంకట సాయి దత్త, పీవీ సింధు కుటుంబానికి ఎప్పటినుంచో అనుబంధం ఉందట.

Read more RELATED
Recommended to you

Exit mobile version