పాక్ స్టార్ బౌలర్ షాహీన్ అఫ్రిది పెళ్లి.. అమ్మాయి ఎవరంటే !

-

పాకిస్తాన్ క్రికెట్ లో మరో పెళ్లి బాజా మోగింది. ఆ జట్టు స్పీడ్ షాహిన్ ఆఫ్రిది వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. చీఫ్ సెలెక్టర్ షాహిద్ ఆఫ్రిది రెండో కూతురు అన్ష ఆఫ్రిదీని అతను పెళ్లి చేసుకున్నాడు. మత పెద్దల సమక్షంలో ఈరోజు ఖరాచీలో నీకా వైభవంగా జరిగింది.

వీళ్ళ వివాహ వేడుకకు పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజాం, సర్పరాజ్ అహ్మద్, నసీం షా, షాదాబ్ ఖాన్ తదితరులు హాజరయ్యారు. షాహిన్ అన్ష పెళ్లి వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆఫ్రిది అన్ష పెళ్లి చేసుకోబోతున్నారనే విషయాన్ని షాహిద్ ఆఫ్రిది 2021లో వెల్లడించిన విషయం తెలిసిందే. పోయిన ఏడాది డిసెంబర్ 30వ తేదీన నసీం నాజీర్, షాహిద్ ఆఫ్రిది పెద్ద కూతురు ఆక్సా వివాహం జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news