PAK vs SL : బాల్స్ వేయకుండానే 9 రన్స్.. ఇదేం బౌలింగ్ రా బాబు..!

-

ఆసియా కప్-2022లో అంచనాలే లేకుండా బరిలోకి దిగిన శ్రీలంక ఏకంగా ట్రోఫీని ఎగురేసుకుపోయింది. దుబాయ్ వేదికగా ముగిసిన పాకిస్తాన్, శ్రీలంక ఫైనల్ లో లంక, పాకిస్తాన్ పై 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే.. పాకిస్తాన్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో శ్రీలంక యువ పెసర్ మధుశంక చెత్త రికార్డు నమోదు చేశాడు. ఒక్క లీగల్ డెలివరీ వేయకుండానే 9 పరుగులు ఇచ్చుకున్నాడు.

అంతర్జాతీయ టి20 లో ఇన్నింగ్స్ ప్రారంభంలోనే ఇంత దరిద్రంగా బౌలింగ్ చేసిన తొలి బౌలర్ గా మధుశంక చెత్త రికార్డును నమోదు చేశాడు. తొలి బంతిని ఫ్రంట్ ఫుడ్ నోబాల్ గా వేసిన మధుశంక, ఫ్రీ హీట్ ను సమర్థవంతంగా అడ్డుకోవాలని ఉద్దేశంతో బౌన్సర్ అందించాడు. కానీ అది బ్యాటర్ తలపై నుంచి దూసుకెల్లడంతో అంపైర్ వైడ్ ఇచ్చాడు. ఆ తర్వాత లెగ్ స్టంప్ టార్గెట్ గా వరుసగా మూడు వైడ్స్ వేశాడు. ఇందులో ఒకటి వికెట్ కీపర్ ను మిస్సై బౌండరీ కి వెళ్ళింది. దాంతో ఒక్క లీగల్ డెలివరీ పడకుండానే పాక్ ఖాతాలో 9 పరుగులు చేరాయి.

Read more RELATED
Recommended to you

Latest news